శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇకపై ఫేస్ ఐడీతో వెరిఫికేషన్..!

-

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో త్వరలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నారు. దీంతో ప్రయాణికుల ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు.. వారి వివరాలు వెరిఫై అవుతాయి.

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులలో ఒకటిగా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అనేక అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ ఎయిర్‌పోర్టులో ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలను అందిస్తున్నారు. అయితే ఇకపై ప్రయాణికులకు మరొక కొత్త సేవ త్వరలో అందుబాటులోకి రానుంది. దాని సహాయంతో ఇక ప్రయాణికుల వెరిఫికేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో త్వరలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నారు. దీంతో ప్రయాణికుల ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు.. వారి వివరాలు వెరిఫై అవుతాయి. ఈ క్రమంలో ప్రయాణికులు గంటల తరబడి బోర్డింగ్ పాస్, ఐడీ కార్డు, పాస్‌పోర్టు చూపిస్తూ ముందుకు సాగాల్సిన పని ఉండదు. క్షణాల్లోనే ప్రయాణికుల వెరిఫికేషన్ పూర్తవుతుంది. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది.

అయితే ప్రస్తుతం ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ట్రయల్ పద్ధతిలో ఉపయోగిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు దీన్ని పరీక్షించాక ఆ తరువాత దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నటుడు చిరంజీవి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించుకున్న ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా.. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వెరిఫికేషన్ కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు.. ఇది నిజంగా అందరికీ ఎంతో ఉపయోగపడనుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version