కొత్త పింఛన్ దారులకు శుభవార్త.. బడ్జెట్‌లో కేటాయింపులు?

-

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలోనే కొత్త పింఛన్ కోసం అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

ఎన్నికల హామీల్లో భాగంగా దరఖాస్తు దారులను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది.ప్రభుత్వం ఇప్పటికే 11 రకాల పింఛన్లను అందిస్తోంది. దీని ద్వారా మొత్తం 42 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పింఛన్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నట్లు సమాచారం. పింఛన్ తీసుకొని చనిపోయిన వారి స్థానంలో కొత్త వారిని చేర్చే అంశంపైనా ఆలోచన చేస్తున్నది. ఈ బడ్జెట్‌లోనే దానికి సంబంధించి కేటాయింపులు సైతం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version