బాన్సువాడ ఎమ్మెల్యే పోచారంపై తిరగబడ్డ ప్రజలు.. ఎందుకంటే?

-

మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై నియోజకవర్గంలోని ప్రజలు తిరగబడిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం కొత్త ప్రారంభించబోయే 4 పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటిని పర్యవేక్షిస్తున్నారు.

గ్రామ,వార్డు సభల్లో గందరగోళం నెలకొంటున్న దృష్ట్యా స్థానిక ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై గ్రామసభకు విచ్చేసిన ప్రజలు తిరగబడ్డారు.ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులను, కాంగ్రెస్ కార్యకర్తలను ఎలా ఎంపిక చేస్తారని ఓ వ్యక్తి ఎమ్మెల్యేను నిలదీశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోచారం మాట్లాడుతున్నా వినిపించుకోకుండా ఆ వ్యక్తి గట్టి గట్టిగా అరుస్తున్న దృశ్యాలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version