న్యూ ట్విస్ట్: నిమ్మగడ్డ నియామకంలో కొత్త యాంగిల్!

-

ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానమే అని ప్రతిపక్షాలు అంటుంటే… వాస్తవాలు ప్రజలకు తెలుసు, వారు చూస్తున్నారు, చూశారు కూడా అనేది ప్రభుత్వం మాటగా ఉంది! ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించొద్దంటూ కోరుతున్నారు విశ్రాంత ఐజీ డాక్టర్‌ ఆలూరి సుందర్‌కుమార్‌ దాస్‌!


అవును.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా నిమ్మగడ్డ రమేశ్‌ ను కొనసాగించవద్దంటూ.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కు, విశ్రాంత ఐజీ డాక్టర్‌ ఆలూరి సుందర్‌ కుమార్‌ దాస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈ–మెయిల్‌ ద్వారా గవర్నర్ ‌కు వినతిపత్రం పంపించారు. ఈస్ అందర్భంగా ఆయన ఇచ్చిన వివరణలు, తీసిన లాజిక్కులు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ను మంత్రిమండలి సిఫారసు మేరకు కాకుండా.. రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం గవర్నర్‌ తన “విచక్షణాధికారం” మేరకు మాత్రమే నియమించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని దాస్‌ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. అంటే… బంతి మీ కోర్టులోనే ఉందని చెప్పడం సుందర్ కుమార్ దాస్ ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చు! ఇదే సమయంలో… పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ –200 కింద నియమితుడైన ఎన్నికల కమిషనర్‌… మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియను చేపట్టలేరని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని స్పష్టం చేస్తున్నారు!

ఈ లెక్కన చూసుకుంటే హైకోర్టు తీర్పు విషయంలో కూడా ఒక వర్గం మీడియా… తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకొస్తోంది తప్ప… తీర్పు పూర్తి పాఠం కానీ, అందులోని అన్ని కీలకమైన విషయాలను కానీ ప్రజలకు తెలియజేయడం లేదని.. ఫలితంగా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా కామెంట్లు వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news