వైసీపీకి ఆ రెండే బిగ్ టెన్ష‌న్‌… ఏం జ‌రుగుతుందో…?

-

రాష్ట్ర వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌.. ప్ర‌తిప‌క్షాలు.. భ‌యంక‌రంగా భావిస్తున్న మూడు రాజ‌ధానులు, సీఆర్ డీఏ ర‌ద్దు బిల్లులు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు చేర‌నున్నాయి. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో స‌ర్వ‌త్రా టెన్ష‌న్ నెల‌కొంది. వీటిని య‌థాత‌థంగా క‌నుక గ‌వ‌ర్న‌ర్ ఆమోదిస్తే.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇక‌, రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న కొన‌సాగించ‌నుంది. మ‌రి ఇప్ప‌టికే ఈ రెండు బిల్లుల‌పై తీవ్ర ఆందోళ‌న‌లు, కేసులు న‌మోదు కావ‌డం, అమ‌రావ‌తిలో రైతులు ఇప్ప‌టికీ ఆందోళ‌న‌లు చేస్తుండ‌డంతో గ‌వ‌ర్న‌ర్ ఏం చేస్తార‌నే అంశం ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వానికి ఈ రెండు బిల్లులకు సంబంధించి శాసనమండలిలో వివాదం నడుస్తోంది. వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్‌ ఆదేశాలివ్వగా అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయలేదు. ఆ తర్వాత గత నెల 16న అసెంబ్లీలో ఈ రెండు బిల్లులను  మళ్లీ ప్రవేశపెట్టిన ప్ర‌భుత్వం ఆమోదింపజేసుకుంది. అనంతరం వాటిని సభాపతి మండలికి పంపారు. అక్కడ చర్చ జరగకుండానే శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ నియమావళి, మార్గదర్శకాల ప్రకారం మండలి ఏ బిల్లునైనా తిరస్కరించినా.. చర్చించకుండా వదిలివేసినా.. నెల రోజుల తర్వాత ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లుగా భావిస్తారు.

ఇప్పుడు ఈ వెసులుబాటును వినియోగించుకుంటున్న ప్ర‌భుత్వం  ఈ రెండు బిల్లులు మండలి ఆమోదం పొందినట్లు పరిగణించి గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నట్లు తెలిసింది. అయితే మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కోర్టులో వ్యాజ్యం ఉన్నా.. బిల్లుల ఆమోదానికి ప్రతిబంధకాలు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఉంది. సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లులో కేంద్రానికి ఎలాంటి సంబంధాలు లేక‌పోయినా.. మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యంలో కేంద్రానికి సంబంధం ఉంది.

ఎందుకంటే.. రేపు క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌న్నా.. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌న్నా..కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్రానికి ఈబిల్లుల‌ను పంపాల్సి ఉంటుంది. అంటే.. గ‌వ‌ర్న‌ర్ ముందుగా ఈ మూడు రాజ‌ధానుల బిల్లును రాష్ట్ర‌ప‌తికి పంపిస్తారు. అక్క‌డ రాష్ట్రపతి వాటిని ఆమోదించాక.. రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. కానీ, ఈలోగా మ‌ళ్లీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగి.. ఏదైనా వివాదం రేగితే ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news