పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు

-

పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు రావడం జరిగింది. ఈ రోజు వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిన నమిత… ఫోటోలు, వీడియో లు వైరల్ గా మారరాయి. గ్రూప్-2 పరీక్షలు రాయడానికి చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్ కు వెళ్ళింది నమిత. దింతో నమితకు తోటి అభ్యర్థులు బెస్ట్ విషెస్ చెప్పారు.

నేడు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఉదయం 8 గంటలలోపే పరీక్షా సెంటర్లకు హాజరయ్యారు. గ్రూప్-2 పరీక్షల కోసం ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ముందుగానే అభ్యర్థులకు మార్గదర్శకాలు సైతం పాస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news