కొత్త కారు కొన్న అంబానీ..ఇండియాలోనే మొదటిది !

-

భారత్ లోనే అతి సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ గ్యారేజీలో కొత్త కార్ వచ్చి చేశ్రింది. 2021 ఆరంభంలోనే ఆయన గ్యారేజ్ లో మూడు అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీలు వచ్చి చేరాయి. భారత్‌ లో లోనే మొట్ట మొదటి, అత్యంత ఖరీదైన కారయిన రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ కారు తాజాగా వచ్చి చేరింది. ఈ బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ ధర రూ.8.20 కోట్లుగా ఉంది. ఇక దీన్ని రోడ్డు పైకి తీసుకు రావాలంటే మొత్తం రూ.10 కోట్ల పైగా ఖర్చు అవుతుంది.

ఈ కారు ఫీచర్స్‌ వింటే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. 6.75 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ 12 ఇంజన్ తో ఉంటుంది. బేసిక్‌ కల్లినన్‌తో పోల్చితే ఈ కారు మరింత శక్తిమంతమైంది. గరిష్ఠంగా 592 హెచ్‌పీ శక్తిని, 900 ఎన్‌ఎమ్‌ టార్క్‌ విడుదల చేస్తుంది. ఈ కారు గంటకు 100 కి.మీ వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. అంతే కాదు రోడ్డు మీదనే కాక ఎడారి, అడవి, బురద, కొండ ప్రాంతం ఇలా ఎలాంటి ప్రాంతంలోనైనా వెళ్ళేలా దీన్ని తయారు చేశారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version