లాక్ డౌన్ సమయంలో ప్రజలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్లకు ఇప్పుడు వినోదం మినహా మరో మార్గం లేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటం… టీవీ పెట్టుకుని ఏ కార్యక్రమాలు వస్తున్నాయో చూడటం. దేశం మొత్తం ఇప్పుడు ఇదే చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వినోద కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. దీనితో పలు టీవీ చానల్స్ ప్రజలకు వినోద కార్యక్రమాలను అందిస్తున్నాయి.
ఇప్పుడు ప్రేక్షకుల డిమాండ్‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వ ఛానల్ దూరదర్శన్ పాత సీరియళ్లు ప్రసారం చేస్తుంది. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. దీనితో ఆ ఛానల్ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దూరదర్శన్ మరో ఛానల్ డిడి రెట్రోను ప్రారంభించింది. దూరదర్శన్ కు చెందిన సీరియల్స్ ఈ ఛానెల్‌లో ఇక నుంచి ప్రసారం చేస్తారు. పౌరాణిక సీరియల్స్ అన్నీ కూడా ఇందులో ప్రసారం చేస్తారు.
మీరు మహాభారతం చూడలేకపోతే, సోమవారం రాత్రి 8 గంటల నుండి డిడి రెట్రోలో చూడండని ఒక ట్వీట్ చేసింది సంస్థ. వీటిలో శక్తిమాన్, చాణక్య, ఉపనిషద్ గంగా, దేఖ్ భాయ్ దేఖ్, బునియాద్, మహాభారతం తదితర సీరియల్స్ ప్రసారం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే రామాయణం ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దీనితో పాత సీరియల్స్ కి మంచి డిమాండ్ రావడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు.