జగన్ సర్కార్ కి హైకోర్ట్ షాక్, ఇంగ్లీష్ మీడియం జీవో రద్దు…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు జీవో నెంబర్ 81,85 ని విడుదల చేసింది. దీనిపై హైకోర్ట్ లో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఇంగ్లీష్ మీడియ౦ ఎంచుకోవడం అనేది విద్యార్ధుల ఇష్టం అని దానిని ప్రభుత్వం ఎలా నిర్దేశిస్తుంది అంటూ విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాయి.

ఇక దీనిపై విచారణ చేసిన హైకోర్ట్… ఈ జీవో ని కొట్టేస్తూ కాసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. ఇంగ్లీష్ మీడియం ఎంచుకోవడం అనేది విద్యార్ధులు, వాళ్ళ తల్లి తండ్రుల ఇష్టం అని… పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్ జీవో ని కొట్టేసింది. ఇక ఈ బిల్లుని శాసన మండలికి ఏపీ సర్కార్ పంపగా అక్కడ కూడా ఇది తిరస్కరణకు గురైంది.

బిల్లుని సెలెక్ట్ కమిటీ కి పంపుతూ శాసన మండలి నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తే బ్యాక్ లాగ్ లు మిగిలిపోతాయని విద్యార్ధుల భవిష్యత్తుకి ఇబ్బందిగా మారుతుందని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించారు. ఇక దీనిపై విపక్షాలకు జగన్ సర్కార్ ఘాటుగానే సమాధానం చెప్పింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నుంచి ప్రతీ ఒక్కరిపై జగన్ సర్కార్ విమర్శలు చేస్తూ వచ్చారు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదివినప్పుడు పేదల పిల్లలు చదవుకోవద్దా అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news