సుధీర్‌తో పెళ్లా.. టైమ్ పాసా..? ర‌ష్మీ దిమ్మ‌తిరిగే స‌మాధానం..!!

-

సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేర్లు. బుల్లితెర‌పై వీరిద్ద‌రి మ‌ధ్య ఉండే కెమిస్ట్రీకి అంద‌రూ ఫిదా అవ్వాల్సిందే. స్టేజ్‌పై వీరి మ‌ధ్య రొమాన్స్ చూస్తే.. నిజంగా వీరి మ‌ధ్య ఏదో ఎఫైర్ న‌డుస్తుంది అన్న సందేహం రాక‌మాన‌దు. ఈ క్ర‌మంలోనే వెండితెర‌పై ప్ర‌భాస్‌-అనుష్క‌ల‌పై ఎన్ని రూమ‌ర్లు వ‌చ్చాయో.. అంత‌క‌న్నా ఎక్కువ సుధీర్-ర‌ష్మీపై వ‌చ్చాయి అంటే వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఎంత బాగా క్లిక్ అవుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. కాని, వీరిద్ద‌రూ తాము కేవ‌లం మంచి ఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెబుతూనే ఉంటారు.

అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రిపై పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. దీంతో సుధీర్ అంటే రష్మి.. రష్మిఅంటే సుధీర్ అనేంతగా ఈ బాండింగ్ పెరిగిపోయింది. ఇక ఈ ఇద్దరూ కల్సి వున్నా వేదిక ఏదైనా అది సూపర్ హిట్టే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే వాస్త‌వానికి సుధీర్ ప‌క్క‌న ఉండ‌డం వ‌ల్లే ర‌ష్మీకి అంత పేరు వ‌చ్చింది అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. ప్ర‌స్తుతం ఈ జంట జబర్దస్త్‌లోనే కాకుండా ఢీ జోడీ ప్రోగ్రాంలో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. రష్మీ గౌతమ్ షూట్స్ ఉన్నా లేకపోయినా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ సుధీర్ విష‌యంలో ఓ ప్ర‌శ్న అడ‌గ‌గా ర‌ష్మీ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా రష్మీ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు ఆన్స‌ర్లు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. సుధీర్ తో పెళ్లి చేసుకునే రిలేష‌న్‌ ఉందా.. లేక ప్రోగ్రామ్స్ కోసం టైం పాస్ చేస్తున్నారా అని ప్రశ్నించాడు. అందుకు స‌మాధానంలో ఈ బ్యూటి గాసిప్స్ గురించి మాట్లాడడం నీకు టైం పాస్.. నాకు కాదు.. కాబట్టి నీ పని నువ్వు చూసుకో అని తిప్పికొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news