Tiger Nageswara Rao : ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు సినిమాలో కొత్త‌ హీరోయిన్.. ఎవ‌రంటే..?

-

మాస్ మ‌హా రాజ రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు. 1970లో స్టూవ‌ర్టుపురంలోని టైగ‌ర్ నాగేశ్వ‌రరావు అనే ఒక దొంగ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను వంశీ తెర‌కెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కాగ టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు చిత్ర బృందం ఒక బిగ్ అప్ డేట్ ను ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో హీరోయిన్ పేరును చిత్ర బృందం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

నుపుర్ స‌న‌న్ ను హీరోయిన్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసింది. అయితే నుపుర్ స‌న‌న్ సింగ‌ర్ గా బాలీవుడ్ కు పరిచయం అయింది. కృతి స‌న‌న్ సోద‌రియే.. నుపుర్ స‌న‌న్. టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు సినిమాతో తొలిసారి హీరోయిన్ గా న‌టిస్తుంది. బాలీవుడ్ లో ఫిల్హాల్ అనే మ్యూజిక్ ఆల్బ‌మ్ లో నుపుర్ స‌న‌న్ క‌నిపించింది. కాగ చిత్ర బృందం నుపుర్ స‌న‌న్ ఫోటో ను ట్విట్ట‌ర్ లో పోస్టు చేసి.. హీరోయిన్ ఫిక్స్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news