ఏపీ సర్కార్‌ శుభవార్త… వరదలకు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇండ్లు !

-

ఏపీ సర్కార్‌ శుభవార్త… వరదలకు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇండ్లు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కొండచరియలు విరిగిపడి కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ తరఫున ఐదు లక్షల ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ మాట్లాడారు.

New houses for those who lost their houses due to floods

విజయవాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని… ఐదుగురు వ్యక్తులు మృతి చెందడం చాలా దురదృష్టకరం అని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే విజయవాడలో అందర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టామని… పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారిందని తెలిపారు. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిలిపివేసిందని ఆగ్రహించారు. ఇక వరదలకు ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version