2 ఏళ్ల‌లో నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం పూర్తి.. విశేషాలివే..!

-

డిసెంబ‌ర్ 10వ తేదీన ప్ర‌ధాని మోదీ నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌నున్న విష‌యం విదిత‌మే. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌ధాని మోదీని స‌ద‌రు కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ఆ త‌రువాత ఓం బిర్లా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఆ రోజు కొత్త పార్ల‌మెంట్ భ‌వన నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది.

నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని సెంట్ర‌ల్ విస్టా రీడెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించ‌నున్నారు. మొత్తం 64,500 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో నూత‌న భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం వాడుతున్న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని 93 ఏళ్ల కింద‌ట బ్రిటిష్ వారు నిర్మించారు. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంలో మ‌నం మ‌న స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌యాణాన్ని ప్రారంభించాం. త్వ‌ర‌లో స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతాయి. అప్ప‌టి నుంచి కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల‌ను నిర్వ‌హించుకుంటాం. అది కేవ‌లం ఇటుక‌లు, రాళ్ల‌తో నిర్మాణ‌మ‌య్యే భ‌వనం కాదు, 130 కోట్ల మంది భార‌తీయుల క‌ల‌.. అని అన్నారు.

ఇక కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం విశేషాలు ఇలా ఉన్నాయి…

* నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించ‌నుంది. ఆ కంపెనీ పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణ కాంట్రాక్టును ద‌క్కించుకుంది.

* హెచ్‌సీపీ డిజైన్‌, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని డిజైన్ చేసింది.

* డిసెంబ‌ర్ 10వ తేదీన మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్ర‌ధాని మోదీ పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు.

* 2022 వ‌ర‌కు కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణాన్ని పూర్తి చేయ‌నున్నారు.

* నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి రూ.971 కోట్ల వ‌రకు ఖ‌ర్చు కానుంది.

* నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణంలో మొత్తం 6 ప్ర‌వేశ ద్వారాలు ఉంటాయి. ఒక దాని గుండా రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని వ‌స్తారు. మ‌రొక దాని ద్వారా లోక్ స‌భ స్పీక‌ర్‌, రాజ్య‌స‌భ చైర్ ప‌ర్స‌న్‌, ఎంపీలు వ‌స్తారు. ఇంకో ద్వారాన్ని ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగిస్తారు. మ‌రో ద్వారాన్ని కేవ‌లం ఎంపీల ప్రవేశం కోసం కేటాయించారు. ఇంకో రెండు ద్వారాల గుండా ప‌బ్లిక్ రావ‌చ్చు.

* కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం కాంప్లెక్స్‌లో మొత్తం 4 ఫ్లోర్లు ఉంటాయి. లోయ‌ర్ గ్రౌండ్‌, అప్ప‌ర్ గ్రౌండ్‌, ఫ‌స్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి.

* లోక్‌స‌భ‌లో 888 సీట్ల‌ను ఏర్పాటు చేస్తారు. దాని విస్తీర్ణం 1145 చ‌ద‌ర‌పు మీట‌ర్లు ఉంటుంది.

* రాజ్య‌స‌భ‌లో 384 సీట్లు ఉంటాయి. ఆ స‌భ విస్తీర్ణం 1232 చ‌ద‌ర‌పు మీట‌ర్లు ఉంటుంది.

* భూకంపాలు వ‌చ్చినా త‌ట్టుకునే విధంగా నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version