పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం.. కమిటీల్లో తెలుగువాళ్లు వీరే..!

-

నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ల నియామకం కొద్ది సేపటి క్రితం జరిగింది. ఈ కమిటీలలో ఈసారి తెలుగు రాష్ట్రాల నుండి బానే ప్రాతినిధ్యం లభించింది. వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్ గా మరో సారి వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని నియమించగా, పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు నియమించబడ్డారు. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ గా బీజేపీ ఎంపీ టిజి వెంకటేష్ నియమించబడ్డారు. ఇక సభ్యులుగా కూడా చాలా మంది తెలుగు ఎంపీలకి పదవులు దక్కాయి. ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా మిథున్ రెడ్డి, సిఎం. రమేష్, జీవీఎల్ నరసింహారావులను నియమించారు. పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, హెచ్ఆర్డీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు , గల్లా జయదేవ్ లను నియమించారు.

ఆరోగ్య శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా టిఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత, న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతలను సభ్యులుగా ఎంపిక చేశారు. ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైఎస్ఆర్సిపి ఎంపీ సత్యనారాయణ, టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రేవంత్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, లక్ష్మీకాంత్లను ఎంపిక చేశారు. ఇంధన శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాష్ , పసునూరి దయాకర్ లనను నిరముంచారు. రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రెడ్డప్ప, సంతోష్ కుమార్ లను నియమించగా పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా బండి సంజయ్ ని నియమించారు. కెమికల్ అండ్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నందిగం సురేష్ ని నియమించారు. బొగ్గు , ఉక్కు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , బడుగుల లింగయ్య యాదవ్ లను నియమించగా గ్రామీణ అభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తలారి రంగయ్యని నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news