బ్రేకింగ్ : ఏపీ చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు !

-

ఏపీలో బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టులు రేపు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో కులాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు సమాచారం. ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి కార్పొరేషన్లు తోడ్పాటు అందించనున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 30వేల పైబడి జనాభా ఉన్నవాందరికీ కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తున్నారు. పురుషులుకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌ పదవులు ఇచ్చినట్టు సమాచారం. 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్మన్‌ పదవులు ఇవ్వనున్నారు. డైరెక్టర్ల పదవుల్లో యాభై శాతం మహిళలకు ఇచ్చారు. ఛైర్మన్‌ పదవుల్లో కూడా అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం ఉండనుంది, అలాగే డైరెక్టర్ల పదవుల్లోనూ వీలైనన్ని జిల్లాలకు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news