ఈ రోజు ఉదయం తెలంగాణ అధికార పార్టీ నుండి ఇద్దరు నాయకులను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వీరిపై ఓ కన్ను వేసిన కేసీఆర్ చివరికి ఈ రోజు అధికారికంగా పార్టీ నుండి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లు ఏ పార్టీలోకి వెళ్లనున్నారు అన్న విషయంపైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే కొత్తగూడెం ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో BRS లో ఇబ్బంది పడుతున్న వారు అంతా ఏకం కాబోతున్నారంటూ తెలుస్తోంది.
ఈయన వ్యాఖ్యలను బట్టి ఇంకా అధికార పార్టీ నుండి ఎన్నికల ముందు పార్టీ మారే నాయకుల జాబితా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికలకు ముందే తెలంగాణాలో వీరి అధ్యక్షతన ఏమైనా కొత్త పార్టీ ఏర్పడే అవకాశం ఉందా అన్నది చూడాలి.