వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కొత్త చిక్కు..!

ప్రపంచవాప్తంగా కరోనా మహమ్మరి వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రతి ఒక్కరు బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వారి సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం అవకాశన్ని ఇచ్చాయి. ఇక ఉద్యోగులు ఇళ్ల దగ్గరే ఉండి పనులు చేసుకుంటున్నారు. వర్క్ చేసుకుంటూ.. తమ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పని చేసేస్తున్నారు. కానీ, వీరిలో కొత్తగా ఒక మానసిక సమస్య బయటపడింది. దానికి కారణం వీడియో కాల్స్ అంటే నమ్మగలరా..

work form home
work form home

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా సహ ఉద్యోగులు, ఉన్నత అధికారులు, క్లయింట్లతో తదితర యాప్ ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. అయితే, ఈ సమావేశాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు జూమ్ డిస్ఫోర్పియాతో బాధ పడుతున్నారంటా.. తమ శరీరంలో లేక మొహంలోని లోపాలు చూసుకుని ఆత్మవిశ్వాసం కోల్పొతున్నారంట. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యేనే డిస్ఫోర్పియా అని అంటారంట.

అయితే సమావేశాల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ముఖాలోని లోపాలను చూసుకుని శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారంట. ఇది వరకు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారు కాబట్టి తమ రూపు, అందం గురించి పెద్దగా ఆలోచించుకునే వారు కాదు. కానీ, ఇప్పటి సమావేశాల్లో తమ మొఖాన్ని చూసుకోవాల్సి రావటంతో వారి వారి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అందోళన చెందుతున్నారు. అందుకే కొంత మంది శస్త్ర చికిత్సల వైపు మెగ్గు చూపుతున్నారు. ముక్కు సరి చేసుకోవటం, ముడతలు తొలగించుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో గూగుల్ సర్చ్ లో ఎక్కువగా ఎక్నే, హేయిర్ లాస్, ఫేస్ టీప్స్ ఇలా అందానికి సంబంధించినవే ఎక్కవగా వెతికేస్తున్నారంటా.. ఈ సర్చ్ పదాలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉద్యోగులు జూమ్ డిస్ఫోరియా తో బాధ పడుతున్నారని. ఈ సమస్యతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించాలని నిపుణులు తెలుపుతున్నారు.