నేటి నుండి కొత్త రూల్స్… ప్రజలపై నేరుగా ప్రభావం..!

-

అప్పుడే కొత్త ఏడాదిలో రెండు నెలలు అయ్యిపోయాయి. ఇప్పుడు మార్చి వచ్చేసింది. ప్రతీ నెలలో కూడా ఎదో ఒకటి మారుతూ ఉంటుంది. అలానే మార్చిలో కూడా కోన్ని రూల్స్ వచ్చాయి. ఈ కొత్త రూల్స్ వలన ప్రజలపై నేరుగా ప్రభావం పడనుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ దగ్గరి నుంచి అమూల్ పాల వరకు కొత్త రూల్స్ వచ్చాయి. అలానే బ్యాంక్ రూల్స్ కూడా మారాయి.

ఈ నెల నుండి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో డైరెక్ట్ గా ప్రభావం పడుతుంది. 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు రూ.105 పెరగడంతో… సిలెండర్ కోసం ఇప్పుడు రూ.2,100 చెల్లించాలి.

ఇది ఇలా ఉంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేయాలంటే రూ.150 చెల్లించాల్సిందే. మార్చి 5 నుంచి ఈ రూల్ రానుంది. అలానే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజింగ్‌కుకి కూడా డబ్బులు కట్టాలి. అలానే కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోకపోతే అకౌంట్లు క్లోజ్ అవుతాయి.

అలానే అమూల్ పాల ధరలు పెరిగాయి. లీటరుకు రూ.2 మేర ధర పెరిగింది. మార్చి 1 నుంచి అంటే నేటి నుండి ఇవి అమలులోకి రానున్నాయి. ఈ పెంపు వలన కస్టమర్స్ పై ప్రభావం పడుతుంది.

లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్స్ కూడా మారిన అంశాలను చూసుకోవాలి. మార్చి 1 నుంచి ఇక పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు పని చేయవు. కొత్తవి అమలులోకి వస్తాయి. కనుక కస్టమర్స్ వారిని గమనించాలి. అలానే కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలి. పాతవి పని చేయవు.

వాహనదారులకు తెలంగాణ పోలీసు శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు నుంచి వాహన చలానా బకాయిల చెల్లింపుపై రాయితీ అందిస్తోంది. టూవీలర్ వాహనదారులు 75 శాతం, ఆటో డ్రైవర్లు 75 శాతం, ఇతర వాహనదారులు 50 శాతం రాయితీ ఇస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version