సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావలి అంటే డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. దానితో లైసెన్స్ ని ఇస్తారు. కానీ ఇది మాత్రం అధునాతన సాంకేతికను ఉపయోగించి రూపొందించడం జరిగింది. అయితే దీని వలన సరిగ్గా డ్రైవింగ్ లైసెన్స్ ని ఇవ్వాలో లేదో అనేది కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. నిజంగా చూస్తే వావ్ అంటారు. ఎందుకంటే వాహనమే డ్రైవింగ్ సామర్ధ్యాన్ని డిటెక్ట్ చేసేస్తుంది.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇక పై తప్పక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇముడ్చుకున్న స్మార్ట్ కారు ద్వారానే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు అబుధాబి పోలీసులు అన్నారు. ఆ కారే డ్రైవింగ్ సామర్ధ్యాన్ని చెప్పేస్తుంది. దీనితో లైసెన్స్ ఇవ్వాలో లేదో కూడా తెలిసిపోతుంది. ఇలా స్మార్ట్ కార్ రిపోర్ట్ ఒకే అయితేనే దరఖాస్తుదారులకు లైసెన్స్ మంజూరు చేస్తారు.