కొత్త సాఫ్ట్ వేర్ కేవలం 5 సెకన్లలో కరోనా పరీక్ష…!

-

కరోనా పరిక్షలు ఎంత వేగంగా చేస్తే అంత వేగంగా కరోనా కట్టడి అవుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరీక్షలను అన్ని దేశాలు వేగవంతం చేసాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. దీనితో వేగంగా కరోనా పరిక్షలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పరికరాలను, టెస్ట్ కిట్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

తాజాగా ఐఐటీ రూర్కీ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ కమల్‌ జైన్‌ ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని తయారు చేసారు. ఈ సాఫ్ట్ వేర్ ఎక్సరే స్కానర్ తో కేవలం 5 సెకన్లలో కరోనా పరీక్షా చేయవచ్చు. 40 రోజులు కష్టపడి దీనిని అభివృద్ధి చేశా అని ఆయన వివరించారు. సాఫ్ట్‌వేర్‌పై మేధోపర హక్కుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇక దీని రివ్యూ కోసం ఆయన ఐసీఎంఆర్‌ను సంప్రదించారు.

దీని ద్వారా పరిక్షా సమయం తగ్గడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుందని వైద్య సిబ్బందికి ప్రమాదం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏ వైద్య సంస్తా కూడా తన వద్దకు రాలేదని అతను పేర్కొన్నారు. నేను రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌లో రోగుల ఎక్స్‌రే చిత్రాలను వైద్యులు సులభంగా అప్‌లోడ్‌ చేయవచ్చు అని… ఈ సాఫ్ట్‌వేర్‌ కేవలం న్యుమోనియాను గుర్తించడమే కాకుండా దానికి కారణం కొవిడ్‌-19 లేదా ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందో గుర్తిస్తుందని, తీవ్రతను చెప్తుందని కేవలం 5 సెకన్లలో ఫలితం వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news