ఇటీవల కాలంలో పెళ్లి అయిన జంటల్లో పిల్లలు పుట్టేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఐవీఎఫ్ పెర్టిలిటీ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే మారుతున్న జీవవ సరళి పురుషుల్లో వీర్యకణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా మరో అధ్యయనంలో నిద్ర కూడా వీర్యకణాల అభివ్రుద్దిపై ప్రభావం చూపిస్తుందని తేలింది.
నిద్ర తగ్గినా.. ఎక్కువ అయినా.. వీర్యకణాలపై ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 6 గంటల కన్నా తక్కువగా, 9 గంటల కన్నా ఎక్కువ సేపు పడుకునే వారిలో వీర్యం క్వాలిటీ పడిపోతుందని గుర్తించారట. అయితే 7-8 గంటల పాటు పడుకునే వారిలో స్పెర్మ్ క్వాలిటీ బాగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం.. విశ్రాంతి లేకపోవడం వీర్యకణాలను దెబ్బతీస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. పడుకునే 2 గంటల ముందు భోజనం చేయాలని..అతిగా ఫోన్లు వాడొద్దని చెబుతున్నారు.