ఆ సాకేంతిక వస్తే.. టోల్‌వద్ద ఆగాల్సిన పని లేదు : కేంద్రమంత్రి

-

దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై త్వరలో కొత్త టోల్ వ్యవస్థ అందుబాటులోకి రానుందని కేంద్రం వెల్లడించింది. దానివల్ల ఇకమీదట టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపే అవసరం ఉండదని తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ టోల్ వ్యవస్థ ద్వారా ప్రయాణీకులు టోల్ ప్లాజాల వద్ద 30 సెకన్లు కూడా ఆగాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రైయిల్స్ జరుగుతున్నాయని, సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించగలిగామని.. ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్‌ వ్యవస్థను ప్రస్తుతం దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో పైలట్‌ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నట్టుగా వీకే సింగ్ చెప్పుకొచ్చారు. మరోవైపు 2023 మార్చిలో ఢిల్లీలోసీసీఐ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఇదే అంశంపై మాట్లాడారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version