ఇదంతా సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది : కొప్పుల ఈశ్వర్

-

ఈరోజు ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.4 కోట్లతో సమీకృత మార్కెట్, 13 లక్షలతో బస్తీ దవాఖాన, 25 లక్షలతో పశువైద్య దవాఖాన కు శంకుస్థాపన, రెండు కోట్లతో సబ్ స్టేషన్, 25 లక్షలతో పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణం, మాజీ ప్రధాని పీవీ, స్వాతంత్ర సమరయోధులుకేవీ కేశవులు, సంగనబట్ల మాణిక్య శాస్త్రి విగ్రహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌.

ఎన్నో ఏండ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న సమీకృత మార్కెట్ ను నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఈరోజు ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధర్మపురి పట్టణంలో ఎన్నో సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందన్నారు. ధర్మపురి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మరకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version