సంగారెడ్డిలో టీఆర్ఎస్ రాజకీయం కొత్త మలుపు తిరుగుతుందా

-

సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరికి వారు ఆధిప్యత్యానికి ప్రయత్నిస్తున్నారట. ఎవరి కుంపటి వారిదే అన్నట్లు ఉందట గ్రూప్‌ ఫైట్‌. పార్టీ పెద్దల మాటలను సైతం ఖాతరు చేయడం లేదట..అధికార పార్టీ నాయకులు నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి చూస్తున్నారట. దీంతో నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు నియోజకవర్గంలో అగ్గిరాజేస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి అధికార పార్టీకి చిక్కలేదు. ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి విజయం సాధించారు. అప్పటి వరకూ ఎమ్మెల్యేగా ఉన్న చింత ప్రభాకర్‌ జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ప్రభాకరే పార్టీకి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే గెలిచిన చోట కలిసికట్టుగా ఉండాల్సిన అధికార పార్టీ నాయకులు నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి చూస్తున్నారట. ఓవైపు చింత ప్రభాకర్‌.. మరోవైపు సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ ఆమె భర్త జైపాల్‌రెడ్డి చక్రం తిప్పాలని చూస్తున్నారట.

వాస్తవానికి జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులది ఆందోల్‌ నియోజకవర్గం. అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో వారు సంగారెడ్డిపై ఫోకస్‌ పెడుతున్నారట. ఇక్కడ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని మెయింటైన్‌ చేస్తున్నారట జైపాల్‌రెడ్డి. ఈ విషయం తెలుసుకున్న చింత వర్గం రుసరుసలాడుతోందట. సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ ఓటమికి పార్టీలోని ఓ వర్గమే కారణమని ప్రచారం చేస్తోందట. టీఆర్‌ఎస్‌ నేతలు కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందాల వల్లే చింత ప్రభాకర్‌ ఓడిపోయినట్లు మండిపడుతున్నారు. ఇలా రెండు వర్గాలూ ఛాన్స్‌ దొరికితే పైచేయి సాధించేందుకు చూస్తున్నాయి.

సంగారెడ్డి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట. సంగారెడ్డి మున్సిపాలిటీని అతికష్టంమీద టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో వర్గ పోరు మొదలైంది. ఆ ప్రభావం మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో కనిపించింది. టీఆర్‌ఎస్‌ ఖాతాలో నాలుగు సీట్లు చేరాల్సి ఉండగా.. మూడే దక్కాయి. వర్గ పోరుతో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. ఈ మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్మన్‌కు చింత ప్రభాకర్‌కు పడటం లేదన్న వాదన ఉంది. పార్టీ పెద్దలు పిలిచి అక్షింతలు వేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇదే సమయంలో చింత వర్గం మరో ప్రచారం మొదలుపెట్టింది. ఎన్నికల్లో ఓడిన తర్వాత నామినేటెడ్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇంత వరకూ ఆ ఊసే లేదని ప్రభాకర్‌ అనుచరులు కామెంట్స్‌ చేస్తున్నారట. సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సైతం తనను ఇంఛార్జ్‌ను చేస్తే బ్యాలెన్స్‌ చేస్తానని అంటున్నారట. మొత్తానికి టీఆర్‌ఎస్‌ నేతల గ్రూపు తగాదాలు రోడ్డెక్కి హీటెక్కిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version