నిజామాబాద్ మర్డర్.. భార్యే బాయ్ ఫ్రెండ్ తో కలిసి ?

నిజామాబాద్ నగరంలో సంచలనం రేకెత్తించిన మార్కెటింగ్ ఆఫీసర్ నారాయణ హత్య కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్యనే హత్య చేయించినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్థారణకు వచ్చింది. ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం హత్యకు దారితీసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ప్లాన్ ప్రకారం భార్యనే భర్తను బాయ్ ఫ్రెండ్ తో కలిసి హత్య చేసినట్లు వారికి ఆధారాలు కూడా లభించాయి. సీసీ కెమెరాలో బాయ్ ఫ్రెండ్ తో పాటు మరో వ్యక్తి నారయణ డెడ్ బాడిని బైక్ పై తీసుకువెళ్లుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

మోపాల్ శివార్ లోని మంచిప్ప అటవి ప్రాంతంలో ఓ బావిలో డెడ్ బాడిని పడేశారు నిందితులు. మొదట భర్త కనబడటంలేదని బార్యనే మిస్సింగ్ కేసు పెట్టింది. పోలిసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టి ఈ నెల 27న మృతదేహాన్ని గుర్తించారు పోలిసులు. మృతదేహంపై కత్తి పోట్లు ఉండటంతో అనుమానం వచ్చి భార్యను అదుపులో తీసుకోని విచారిస్తున్నారు పోలిసులు. ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ కూడా అదుపులో తీసుకుని పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.