సినిమా స్టార్ట్ అవ్వకముందే కమల్ టీజర్ రిలీజ్…!

-

లోక నాయకుడు కమల్.. ఇండియన్ 2ను పక్కకు పెట్టి లోకేష్ కనగరాజ్ తో సినిమాకు కమిటైపోయాడు.కమల్ కు ఇది 232వ ప్రాజెక్ట్ కావడంతో …ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని మరీ..ప్రీప్లాన్డ్ గా షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఐతే ఈలోపే నవంబర్ 7న కమల్ బర్త్ డే వస్తూ ఉండడంతో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయడానికి అన్నట్లుగా..ఒక్కసారిగా టీజర్ వదిలేస్తున్నారు.అసలు సినిమా షూటింగే స్టార్ట్ కాకుండా.. టీజర్ ను వీరు ఎలా ముందుగా వదులుతున్నారు.

కమల్ హాసన్ ఈ మధ్య అంత చెప్పుకోదగ్గ ప్రయోగాలేమీ చేసింది లేదు.ఇండియన్ 2తో పక్కా కమర్శియల్ అటెంప్ట్ మాత్రమే చేస్తున్నాడు.అది రకరకాల కారణాలతో షూటింగ్ నిలిపివేయడంతో శంకర్ మరో ప్రాజెక్ట్ సిట్టింగ్స్ లో బిజీ అయిపోయాడు.దీంతో కమల్ లైకా ప్రొడక్షన్ పై ఒత్తిడి తేకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఖైదీతో గుర్తింపు పొందిన కనగరాజ్ మాస్టర్ ఫిలిం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఇప్పటికే వీరిద్దరి ఫిలింకు సంబందించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది.అందుల్లో కమల్‌ హాసన్ షేడ్‌.. తుపాకులతో నిండి ఉంది. అంతేకాదు `వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ దేర్‌ లైవ్డ్ ఏ ఘోస్ట్ అని రాసుంది.పోస్టర్ చూసాక ఇది పక్కా యాక్షన్ థ్రిల్లర్ అనేవిషయం అర్ధమైపోయింది.ఇక సినిమా షూట్ కు వెలదాం అనుకునే లోపు కమల్ హాసన్ బర్త్ డే నవంబర్ 7న వస్తుండడంతో ముందుగానే సర్ఫైజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.దానిలో భాగంగా సినిమా షూట్ కంటే ముందు టీజర్ కు రెఢీ అయిపోయారు. సినిమా స్టార్ట్ కాకముందే టీజర్ రిలీజ్ చేయాలనుకోవడమేంటో కొందరికి అర్ధం కాలేదు. లోకేష్ అసలు షూటింగ్ జోలికే పోకుండా టీజర్ ను కట్ చేయాలనుకోవడం టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయింది.నిజానికి సినిమాకు సంబందించి ట్రయల్ షూట్ ని ఇప్పటికే పూర్తి చేశారు. దానిలో టీజర్ కు కావల్సిన సీన్స్ ను కట్ చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news