ఘట్కేసర్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్ లు.. అంతా అబద్దమేనా ?

-

హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్ సమీపంలో ఫార్మసీ విద్యార్థిని మీద అత్యాచార యత్నం కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ ఘటనకు కారణం అని పోలీసులు నలుగురు ఆటో డ్రైవర్లను కూడా అరెస్టు చేశారు. అంతే కాదు ఈ ఆటోడ్రైవర్లు పరమ దుర్మార్గులు అని, గతంలోనే ఇలాంటి ఘటనలు కూడా ఎన్నో చేశారని అనుమానాలు తమకు ఉన్నాయని మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే వీరిని తీసుకుని వెళ్లి సీన రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు..

RAPE

సీనరీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో అసలు యువతి కిడ్నాప్ కు గురి కాలేదని అక్కడ సీసీ టీవీ దృశ్యాలు ద్వారా పోలీసులు గుర్తించారు.. దీంతో ఈ కేసులో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మసీ విద్యార్థిని బుధవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తనను ఒక ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని తల్లికి ఫోన్ లో చెప్పింది. అయితే వెంటనే తల్లి డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఆమె ఫోన్ కాల్ సిగ్నల్ ద్వారా ఎక్కడుందో ట్రేస్ చేసి అపస్మారక స్థితిలో ఉన్న యువతిని హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు.

 

హాస్పిటల్ లో స్పృహలోకి వచ్చాక తన మీద కొందరు ఆటోడ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని ఆమె చెప్పడంతో నలుగురు అనుమానాస్పదంగా ఉన్న ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే సీసీ కెమెరాల ప్రకారం ఆ యువతి ఒక యువకుడి బండి మీద వెళ్లినట్లు గుర్తించారు.  అంటే ఒక రకంగా యువతి కావాలనే యువకుడితో పాటు వెళ్ళింది. కానీ ఈ ఘటన అనంతరం గ్యాంగ్ రేప్ జరిగిందని హాస్పిటల్లో జాయిన్ చేస్తే, డాక్టర్లు కూడా గ్యాంగ్ రేప్ జరిగిందని ధ్రువీకరించడం గమనార్హం. దీంతో అసలు ఈ ఘటనలో ఏమైందో ఏమో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version