బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. టెక్నాలజీని ఉపయోగిస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు కిడ్నాపర్లు. దీంతో ఆర్థిక లావాదేవీలు, బంధువుల మధ్య విబేధాలు, అక్రమ సంబంధాలు వంటి వాటి మీద పోలీసులు ద్రుష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 8సార్లు కిడ్నాపర్ నుంచి బాలుడి తల్లికి ఇంటర్ నెట్ నుండి ఫోన్ కాల్ వచ్చింది.
మహబూబాబాద్ పట్టణంలో ఉన్న 140 సీసీ కెమెరాలు అలానే 6 ANPR కెమెరాలకు కూడా చిక్కకుండా కిడ్నాపర్లు జాగ్రత్త పడ్డారు. ప్రతి ఫోన్ కాల్ కు ఒక్కో మలుపు తిరుగుతోంది ఈ కిడ్నాప్ వ్యవహారం. బాలుడి వివరాలు తెలిపిన వారి పేరు గోప్యంగా ఉంచి తగిన పారితోషకం అందిస్తామని మహబూబాబాద్ పోలీసులు ప్రకటించారు కూడా.