అవును… మనకన్నా ముందే కొన్ని దేశాలకు కొత్త సంవత్సరం వచ్చేసింది. వాళ్లు ఇప్పుడు 2019 సంవత్సరంలో ఉన్నారు. మనకు ఇక్కడ 2018 సంవత్సరం ముగియకముందే అక్కడ 2019 సంవత్సరం ఎలా వచ్చిందంటారా? ఎందుకంటే.. అవి మనకంటే ముందు టైమ్ జోన్ ఉన్న దేశాలు. మనది జీఎంటీ ప్లస్ 5.30 కాగా… న్యూజీలాండ్ ది జీఎంటీ ప్లస్ 13. అంటే మనకన్నా 7.30 గంటలు ఎక్కువ అన్నమాట. అందుకే.. మన టైమ్ ప్రకారం సాయంత్రం 4.30 కే వాళ్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఇక.. ఆస్ట్రేలియా కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మన టైమ్ ప్రకారం 6.30 కే వాళ్లు కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. వాళ్లది జీఎంటీ ప్లస్ 11 టైమ్ జోన్ అన్నమాట. కొత్త సంవత్సరం సందర్భంగా సిడ్నీలో సంబురాలు అంబరాన్నంటాయి.