రాత్రి పార్టీకి వెళ్లాలి. అందరికంటే భిన్నంగా కనిపించాలి. ఎలా రెడీ అవ్వాలి. రోజూ రెడీ అవుతూనే ఉన్నా ఎందుకో ఆరాటం, ఆంధోళన. పార్టీ.. మేకప్ అనగానే కొత్తభావన వస్తుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా సులభంగా, అందంగా రెడీ అవ్వండి.
ఫౌండేషన్ : ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని తడిలేకుండా పొడిబట్టతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఫౌండేషన్ క్రీమ్‌ను చేతివేళ్లతో తీసుకొని ముఖానికి రాసుకోవాలి. ముందుగా క్రీమ్‌ను అక్కడక్కడా డాట్స్‌గా ఐప్లె చేసుకోవాలి. వాటిని అనుసరిస్తూ ముఖం అంతా రాసుకోవాలి. పొడిపొడిగా లేకుండా చేసుకోవాలి. ముఖమంతా ఐప్లె చేశాక ఫౌండేషన్ పౌడర్ రాసుకోవాలి. దీంతో ముఖానికి గ్లో వస్తుంది.
ఐలైనర్ : మేకప్‌లో ముఖ్యమైనది ఐలైనర్. కళ్ల అందంగా ఆకర్షణీయంగా ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. అందుకోసమే కళ్లకు కాటుక పెట్టుకోవాలి. ఇప్పుడు కాటుక ఎవరూ పెట్టుకోవడం లేదు కాబట్టి కాజల్ వాడాలి. కళ్లకు కింది భాగంలో కాజల్ పెట్టుకొని ఫైబాగంలో ఐలైనర్ వాడాలి. పక్కకు పోనివ్వకుండా పర్‌ఫెక్ట్‌గా వేయాలి. తర్వాత మరిచిపోకుండా కనురెప్పలకు మస్కారా వాడాలి. కనురెప్పలకు సరిపోయే కలర్ మస్కారా ఐప్లె చేయాలి. తర్వాత కనురెప్ప పైన పింక్‌కలర్‌ను రాసుకోవాలి. ఆ కలర్‌నే చెంపలపై రాసుకోవాలి. తర్వాత పెన్సిల్‌తో ఐబ్రోస్ చేసుకోవాలి. అప్పుడే ముఖం మెరుస్తుంది.
లిప్‌స్టిక్ : ముఖం, కళ్లు రెండింటినీ అందంగా తీర్చిదిద్దాం. ఇక అసలు అందం పెదవులలో దాగుంది. పెదవులు ఎంత బాగుంటే ముఖానికి అంత లుక్ వస్తుంది. రెడ్, పింక్, ఆరెంజ్, మెరూన్ ఇలా ఏ రంగులైనా పెదవులకు సరిగా నప్పుతాయి. కాకపోతే ఎవరికి ఏవీ నప్పుతాయో ముందుగా టెస్ట్ చేసుకోవాలి. లేదంటే మ్యాచ్ అవ్వదు. తెల్లగా ఉండేవారికి ఏ రంగైనా నప్పుతుంది. చామన్‌చాయ రంగువారు కొంచెం జాగ్రత్త వహించాలి. కొంచెం డార్క్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది.
జ్యూవెల్లరీ : పార్టీకి తగినట్లుగా మేకప్ వేసుకుంటాం. అలాగే పార్టీకి తగినట్లుగా దుస్తులు ధరిస్తాం. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని నగలు ధరించాలి. వళ్ళంతా దిగేసుకునేకంటే సింపుల్‌లుక్‌నిచ్చే ఆభరణాలే ఎంతో లుక్‌నిస్తుంది. చేతికి సన్నని గాజు, వాచ్, చెవులకు కమ్మలు, మెడలో సన్నని నెక్లెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అందరి దృష్టి మీవైపే ఉంటుంది.