నేడే న్యూజిలాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..ప్రార్థనలు చేస్తున్న ఇండియన్స్ !

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ.. న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ అబుదాబీ లోని షేక్ జయద్ స్టేడియం లో జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం…3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ అటు న్యూజిలాండ్ మరియు ఇటు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చాలా కీలకంగా మారింది.

ఇక వరుస గెలుపు లతో.. న్యూజిలాండ్ దూసుకు పోతుండగా… ఆఫ్ఘనిస్తాన్ జట్టు మాత్రం కాస్త తడబడుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే కచ్చితంగా రేసులోకి వెళుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే… టీమిండియాకు సెమీస్ బెర్తు ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో.. టీమిండియా ఫ్యాన్స్ మరియు ఇతరులు.. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ.. కొన్ని మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ టీమిండియాకు అగ్ని పరీక్షగా మారింది. అయితే ఈ మ్యాచ్లో అడ్వాంటేజ్ మాత్రం న్యూజిలాండ్ జట్టు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version