కోలీవుడ్ దర్శకుడి మీద బన్ని కన్ను..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడన్న విషయంపై ఇంకా ఓ క్లారిటా రావాల్సి ఉంది. మనం దర్శకుడు విక్రం కుమార్ తో బన్ని సినిమా ఉంటుందని చెబుతున్నా అది ఇంకా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేయలేదు కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. లేటెస్ట్ గా బన్ని మరో తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది.

తెలుగులో గోపిచంద్ తో శౌర్యం, శంఖం, రవితేజతో దరువు సినిమా చేసిన దర్శకుడు శివ తమిళంలో ఇప్పుడు స్టార్ డైరక్టర్స్ సరసన చేరాడు. వరుసగా అజిత్ సినిమాలను డైరెక్ట్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడు శివ. వీరం నుండి రాబోతున్న విశ్వాసం వరకు శివ డైరక్షన్ లో అజిత్ క్రేజీ మూవీస్ చేస్తున్నాడు. వీరం, వేదాలం సూపర్ హిట్లు కొట్టగా వివేగం అంచనాలను అందుకోలేదు.

అందుకే మరోసారి ఇద్దరు కలిసి విశ్వాసం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నితో తెలుగు, తమిళ భాషల్లో అజిత్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట శివ. చూస్తుంటే బన్ని క్రేజీ ప్రాజెక్ట్ నే పట్టేశాడని అనిపిస్తుంది. ఈ సినిమాకు కే.ఈ. జ్ఞావెల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news