గోదారి బోటు స‌త్యం చేతికి చిక్కేసిన‌ట్టేనా..

-

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి సత్యం బృందం పురోగతి సాధించిన విషయం తెలిసిందే.  బోటు ప్ర‌మాదం జ‌రిగి నెల రోజులు అయిపోయినా కూడా ఏపీ స‌ర్కారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని బోటు వెలికితీత ప‌నుల‌ను మాత్రం ఆపేయ‌లేదు. ఇక నిన్న బోటు రెయిలింగ్‌ను బయటకు తీసిన ఆ బృందం తమ ప్రయత్నాలను ఈ రోజు కూడా కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. 50 అడుగుల లోతులో రాయల్ వశిష్ట బోటు ఉన్నట్లు వెల్లడించారు. ఈ రోజు విశాఖపట్నం నుంచి కొందరు డైవర్లు వస్తారని తెలిపారు.

భారీ లంగరుతో పాటు 3 వేల అడుగుల ఇనుప తాడును, ఒక వెయ్యి మీటర్ల నైలాన్ తాడును కూడా ఇందుకోసం నేడు ఉపయోగించనున్నారు. వీలైనంత త్వరగా దాన్ని ఒడ్డుకు లాక్కొస్తామంటున్నారు. బోటు వెలికితీతపై ధర్మాడి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆది నారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మంది ఆచూకీ గల్లంతైంది.

Read more RELATED
Recommended to you

Latest news