మరో 30 ఏళ్ళు జగనే సీఎం…సేమ్ చంద్రబాబే!

-

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్త్ ఉండొచ్చు గానీ..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదనే చెప్పాలి. ఎంత ప్రజా మద్ధతు ఉన్నా సరే…ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళితే ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏపీలో అధికార వైసీపీ ఉన్నట్లే కనిపిస్తోంది. అవును ప్రజలు జగన్‌కు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. ఆ సపోర్ట్ వల్లే 2019 ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకున్నారు. ఇప్పటికీ ప్రజల మద్ధతు జగన్‌కు ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ ప్రజా మద్ధతు ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఎవరూ చెప్పలేం. కానీ ఎప్పుడు ప్రజల మద్ధతు పొందేలా పాలన అందించాలి.

jagan

మరి ఇప్పుడు జగన్ అదే రకమైన పాలన అందిస్తున్నారా? అంటే అది జనాలనే అడగాలి. జగన్ పాలన పట్ల ప్రజలు ఏం అనుకుంటున్నారో వైసీపీ నేతలకు తెలియడం లేదనే చెప్పాలి. అసలు క్షేత్ర స్థాయిలో పరిస్తితులని వైసీపీ నేతలు…జగన్‌కు చెబుతున్నట్లు కనిపించడం లేదు. అవేం చెప్పకుండా జగన్ మరో 20, 30 ఏళ్ళు సీఎంగా కొనసాగుతారని స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఆఖరికి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అలాగే మాట్లాడుతున్నారు. సలహాదారుడు అంటే వాస్తవ పరిస్తితులని కూడా అర్ధమయ్యేలా సీఎంకు చెప్పాలి. కానీ సజ్జల కూడా వాస్తవాలని చెప్పకుండా జగన్‌కు భజన చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉంటే భవిష్యత్‌లో దెబ్బతినడం ఖాయం. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అసలు ప్రజలంతా తమతోనే ఉన్నారని, ఇంకా 20 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎం అని మాట్లాడారు. అసలు టీడీపీ నేతలు…వాస్తవ పరిస్తితులని చంద్రబాబుకు చేరవేయలేదు. దాని వల్ల 2019 ఎన్నికల్లో ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సేమ్ సీన్ కనిపిస్తోంది. అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పటికీ ప్రజల మద్ధతు జగన్‌కు ఉంది కానీ…2019 ఎన్నికల్లో వచ్చిన మద్ధతు మాత్రం లేదు. అంటే పరిస్తితి ఎలా మారుతుందో అర్ధం చేసుకోవచ్చు. అది తెలుకోకుండా 30 ఏళ్ళు సీఎం అంటే…భవిష్యత్‌లో దెబ్బతినే పరిస్తితి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version