నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం వారు, హక్కుల కార్యకర్తల ఇళ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద 31 మంది ఇళ్లలో ఈ సోదాలు కొద్ది సేపటి క్రితం ముగిసాయి. ఈ సోదాల్లో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
పంగి నాగన్న, అందులూరి అన్నపూర్ణ, జన్గిరాల కోటేశ్వర రావు, మానికొండ శ్రీనివాస రావు, రేలా రాజేశ్వరి, బొప్పిడి అంజమ్మలను అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురు నిందితుల నుంచి 40 సెల్ ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్క్ లను సీజ్ చేశారు. అంతే కాక మైక్రో ఎస్డీలను, 180 సీడీలు, 19 పెన్ డ్రైవ్ లు, ఆడియో, వీడియో టేప్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే పది లక్షల నగదు, పెద్ద ఎత్తున మావోయిస్టు సాహిత్య పుస్తకాలు సైతం స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.