ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న నిహారిక కొణిదెల పెళ్ళి పనులు మొదలయ్యాయి. పెళ్ళి పనులలో ముఖ్యమైన పసుపు దంచే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇందులో నిహారిక అక్క చెల్లెళ్లు, తోడి కోడళ్ళు, అత్తలు అందరు హాజరయ్యారు. ఈ వేడుకతో పెళ్ళి పనులు మరింత ఊపందుకోనున్నాయనే చెప్పవచ్చు. అయితే పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన వీడియోని నిహారిక తన ఇన్స్టాలో షేర్ చేయగా, అది వైరల్ అయింది.
నిహారిక, చైతన్యల పెళ్లి వచ్చే అక్టోబర్, నవంబర్లో జరిగే అవకాశాలున్నాయని మెగాకుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇటీవలే జరిగిన వీరి నిశ్చితార్ధ వేడుకకు పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే.