మరి కొద్దిసేపటిలో రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు. నామినేషన్ గందరగోళం పై రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు. నామినేషన్ దాఖలు చేసి మరణించిన అభ్యర్థులు స్థానంలో కొత్త నామినేషన్ల అంశంపై ఈ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
మరో పక్క వైసీపీ బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ చేయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలానే ఎన్నికల విధుల్లో వాలంటీర్ల నిషేధంపై వైసిపి అభ్యంతరం చెబుతోంది. వాలంటీర్ల ఫోన్ లను స్వాధీనం చేసుకోవాలని నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల మీద వైసీపీ అభ్యంతరాలు చెబుతోంది. ఈ రోజు జరిగనున్న సమావేశంలో ఈ అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని మీద నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో అనేది కూడా ఆసక్తికరంగా మారింది.