దీక్షలు చేయిస్తుంది బాబేనట… తేల్చేసిన టీడీపీ నేత!

-

ఇది కరోనా టైం… ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, వేదిక ఏదైనా, సౌండ్ ఎలాంటిదైనా… విషయం మాత్రం ఒకటే! అంతా ఇళ్లల్లో ఉండండి… భౌతిక దూరం పాటించండి అని జనాలకు చెబుతుంటే… కాస్త ఈ నాలుగురోజులైన రాజకీయాలు మాని ప్రభుత్వాలకు సహకరించండని రాజకీయ పార్టీలకు, ప్రతిపక్షాలకు! ఇవన్నీ వినేవారికీ.. అర్ధం చేసుకునే వారికే తప్ప తమలాంటి వారికి కాదనుకున్నారో ఏమో కానీ… వరుసపెట్టి టీడీపీ నేతలు హాల్ఫ్ డే దీక్షలు చేసేస్తున్నారు. ఇదే క్రమంలో… సమయం సంద్రభం లేకుండా చేసే ఇలాంటి చిల్లర రాజకీయాల సంగతి చంద్రబాబు దృష్టికి వెళ్లడం లేదేమో… అధినేతకు తెలిస్తే ఊరుకోరు అని ఫీలయిన సగటు కార్యకర్త గాలి కూడా తాజాగా తీసేశారు టీడీపీ నేతలు!

నిమ్మల రామానాయుడు.. మంతెన రామరాజు వంటి వారు ఇప్పటికే ఈ విషయంలో తమ పనిని మమ అనిపించేస్తే… ఆ వరుసలో మూడోస్థానం కోసం పోటీపడుతున్నారు పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మల చినరాజప్ప! తాజాగా ప్రతీ పేద కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ కూర్చున్న చినరాజప్ప… పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే 12 గంటల నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టానని చెప్పేశారు! దీంతో… టీడీపీ చేస్తున్న కరోనా రాజకీయ దీక్షలు అన్నీ బాబు కనుసన్నళ్లోనే జరుగుతున్నాయన్ని క్లారిటీకి వచ్చేశారు ఏపీ వాసులు!

ఈ విషయాలపై స్పందిస్తున్న విశ్లేషకులు మాత్రం… చంద్రబాబు ఇలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదని చెప్పడం కొసమెరుపు కాగా… తమ నాయకుడు చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే!!

Read more RELATED
Recommended to you

Exit mobile version