ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ప్రసవించింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మరియమ్మను ఆర్టీసీ బస్సులో అత్తవారి ఇంటి నుంచి కాన్పు కోసం కర్ణాటకలోని ధరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో బస్సు డ్రైవర్ ఓ పక్కను నిలిపివేశాడు.
బస్సులోని ప్రయాణికులు అంతా కిందకు దిగారు. అక్కడే ఉన్న మహిళలు కలిసి మరియమ్మకు ప్రసవం చేశారు. బస్సులోనే గర్భిణి ప్రసవించగా తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారు. బస్సును పక్కకు ఆపి మహిళ ప్రసవానికి సహకరించిన డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికులకు మరియమ్మ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.