ఫిబ్రవరి 1 న ఉరి తీయబోయే నలుగురు నిర్భయ కేసు దోషులు తమ కుటుంబాన్ని చివరిసారిగా కలవడంపై గాని, లేదా వారి ఆస్తులను అంగీకరించడం వంటి ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం ఇవ్వలేదని తిహార్ జైలు వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మరణ శిక్ష పడిన దోషులు తమ కుటుంబ సభ్యులను కలవడానికి గాను, ఒక తేదీ ఉంటుంది. తమ ఆస్తిని ఎవరికి అయినా దానం చెయ్యాలి అనుకున్నా సరే వారికి అవకాశం ఉంటుంది.
ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ మరియు పవన్ గుప్తా – నిందితులు ఈ ప్రశ్నలపై మౌనంగా ఉన్నారు. వాస్తవానికి వారిని బుధవారమే ఉరి తీయాల్సి ఉన్నా ఫిబ్రవరి 1 వరకు ఉదయం 6 గంటలకు వాయిదా పడింది. మరణశిక్ష కేసులలో మార్గదర్శకాలలో మార్పు కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది, కాబట్టి దోషులు తమ ఉరి శిక్షను చట్టపరమైన విధానాల ద్వారా ఇంకా ఆలస్యం చేయడం దాదాపుగా అసాధ్యమని అంటున్నారు.
డెత్ వారెంట్ సంతకం చేసిన తరువాత పిటిషన్లు దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు గడువు విధించాలని ప్రభుత్వం కోరుతోంది. గత వారం, మరో దోషి, పవన్ గుప్తా, నేరం జరిగినప్పుడు తాను 18 ఏళ్లలోపు ఉన్నానని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఆ పిటీషన్ ని సుప్రీం కోర్ట్ కొట్టేసింది. వారిని తీహార్ జైల్లో ఫిబ్రవరి ఒకటిన మీరట్ కి చెందిన ఒక తలారి ఉరి తీయనున్నారు. ఆయన పేరు పవన్, ఉత్తరప్రదేశ్ ఏకైక అధికారిక తలారిగా ఉన్నారు.