మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన నిర్మల.. ఏం జ‌రిగిందంటే..?

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘంగా కొనసాగించి పూర్తి చేయకుండానే ముగించారు. ఈ రోజు లోక్ సభలో మంత్రి బడ్జెట్ పై ప్రసంగిస్తూ.. అస్వస్థతకు గురయ్యారు. వాస్త‌వానికి అప్పటికే 2 గంటల 40 నిముషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగడంతో ఆమె కొంత అలసటకు లోనయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో.. ఓ సందర్భంలో నిల్చోలేక పోయారు. ఆమెకు మధుమేహ సమస్య ఉండటం, అప్పటికే ఎక్కువ సేపు నిల్చుని ఉండటం వల్ల బీపీ కూడా పడిపోవడంతో చెమట పట్టి.. కాస్త అస్వస్థతకు లోనై కొద్దిసేపు కూర్చుండిపోయారు.

ఆ సమయంలో ఆమెకు షుగర్ అందించారు. తిరిగి ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మల సుదీర్ఘంగా చదివి వినిపించారు. అయితే.. అప్పటికీ చదవాల్సిన ప్రసంగ ప్రతుల్లో రెండు పేజీలు మిగిలిపోయాయి. చదివేందుకు ఆమె పేజీ తిప్పుతుండగా.. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆమె వైపు చూసి ఇక ప్రసంగాన్ని ముగించవచ్చన్నట్టుగా సైగ చేశారు. దీంతో.. ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. కొద్దిసేపటికి ఆమె అక్కడ నుంచి రాజ్యసభకు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పయనమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news