ఓటీటీలోకి “మాచర్ల నియోజకవర్గం”.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

-

ఆగస్ట్‌ మాసం ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు క‌థానాయ‌కుడు నితిన్‌. చాలా కాలం త‌ర్వాత నితిన్ నుంచి వచ్చిన పూర్తి స్థాయి మాస్ చిత్రమిది. కొత్త ద‌ర్శకుడు ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. అదిరిపోయే ఫైట్స్‌, చ‌క్కటి మాస్ ఎలిమెంట్స్‌తో ప్రచార చిత్రాలు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు ఏర్పడ్డాయి.

ట్రైలర్ తోనే సినిమాలో నితిన్ ఫుల్ జోష్ లో కనిపిస్తారని అర్థమైంది. పంచ్ డైలాగ్ లు కూడా ఈ మూవీలో బాగానే ఉన్నాయి. అయితే, ఈ సినిమా అనుకున్న మేర కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇది ఇలా ఉండగా, “మాచర్ల నియోజకవర్గం”.. ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. డిసెంబర్‌ 9వ తేదీన జీ 5 ఓటీటీలో ఫ్లాట్‌ ఫాంలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version