ప్రభాస్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..వీడియో వైరల్..!!

-

టాలీవుడ్హీరో ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమె..ప్రభాస్ వివాహం ఎప్పుడాని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం హీరోయిన్ కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఈ విషయం నిజం అనుకునేలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి వార్తలు కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలపడేలా చేస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ప్రభాస్ పేరు చెప్పగానే టక్కున అనుష్క పేరు గుర్తుకు వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా కట్టిపడేసేలా చేస్తుంది. దీంతో వీరిద్దరికి వివాహం అవుతే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం కేవలం ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ విషయం సైలెంట్ గా మారిపోయింది.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ కృతిసనన్ మాత్రం హీరో ప్రభాస్ పైన స్పెషల్ అట్రాక్షన్ చూపించినట్లు చాలా క్లోజ్ గా మూవ్ అయినట్లుగా కనిపించింది.

గతంలో కూడా కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన కృతి.. అక్కడ ప్రభాస్ కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందట. మళ్లీ ఆ తర్వాత ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రభాస్, కృతిసనన్ జోడి కూడా బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్ మోకాలికి సర్జరీ కావడంతో ఆరోజు సరిగ్గా నడవ లేకపోవడంతో అక్కడ ఉన్న కృతి తన చెయ్యి అందించి సహాయం చేసి ప్రభాస్ కు చెమటలు పడుతుంటే తన చీర కొంగును అందించి ఇలా అన్ని చేయడంతో వీరిద్దరి మధ్య పలు వార్తలు వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృతికి ఒక ప్రశ్న ఎదురైంది.. ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లుర్టింగ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేట్ చేస్తావని యాంకర్ 3 ఆప్షన్లు ఇవ్వగా.. కార్తీక్ ఆర్యన్ తో ఫ్లుర్టింగ్, టైగర్ ఫ్రాష్ తో డేటింగ్ అని.. ఛాన్స్ వస్తే ప్రభాస్ ని వివాహం చేసుకుంటానని తెలియజేసింది కృతి సనన్. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version