బిగ్ బాస్: తల్లి కోరిక నెరవేర్చి కెప్టన్ అయిన ఇనాయ.!

-

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. గత మూడు రోజులుగా ఫ్యామిలీ మెంబెర్స్ రాకతో హౌస్ ఎమోషనల్ గా అయ్యింది. ఇక రకరకాల టీచర్స్ వేషాలతో హౌస్ మెట్స్ ఫన్ క్రియేట్ చేశారు. ఈవారం కూడా కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇక హౌస్ లో ఉన్న వారిలో  కొంత మంది రెండు సార్లు  కెప్టెన్ అయ్యారు. కాని ఇనయ, రోహిత్ మాత్రం ఇప్పటి వరకూ కెప్టెన్స్ అవ్వలేదు. ఇనాయ వాళ్ల అమ్మకు కెప్టెన్ అవుతానని మాట ఇచ్చింది.దాంతో ఈ సారి కెప్టెన్సీ టాస్క్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అయ్యింది.

టాస్క్ లో అందరూ ఓడిపోగా చివరిగా శ్రీసత్య – ఇనయా మిగలగా.. వారిద్దరూ నువ్వా నేనా అని పోటీ పడ్డారు.హౌస్‌కి కెప్టెన్ అవ్వాలంటే ఇది చివరి అవకాశం కావడంతో.. రెచ్చి పోయి మరీ ఆడి  హౌస్‌కి కెప్టెన్ అయ్యింది ఇనయ సుల్తానా.ఈవారం కెప్టెన్ అయిన వాళ్లు నేరుగా సెమీ ఫైనల్ వెళ్ళింది. తర్వాత ఫైనల్ కు వెళ్ళే అవకాశం సృష్టించు కుంది.

మొత్తానికి తన కోరికతో పాటు తన తల్లి కోరికను తీర్చింది ఇనయ. కెప్టెన్ కావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక రోహిత్ చివరి అవకాశంగా వచ్చిన టాస్క్ లో కూడా కెప్టెన్ కాలేకపోయినందకు ఎమోషనల్ అయ్యాడు. చాలా సేపు కన్నీరు కారుస్తూ ఉన్నాడు.  ఇక వారం రోజులు గా రోహిత్ తో టార్చర్ అనుభవిస్తున్న హౌస్ మేట్స్ కూడా పండగ చేసుకున్నారు. ఇక ఇనయ కూడా మీకు నిబంధనలు ఏమి పెట్టను ఇష్టం వచ్చినట్టు తిని ఎంజాయ్ చేయండి అనడంతో వారి ఆనందం కు హద్దులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version