నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ విడుదల

-

నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021 జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకోగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హర్యానా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ స్థానం దక్కింది. ఈ మేరకు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ తాజా నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 17 ప్రధాన రాష్ట్రాలు, 10 ఈశాన్య రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు, సిటీ-స్టేట్స్ తరహాలో విభజించామన్నారు.

నీతీ అయోగ్

కర్ణాటక, తెలంగాణ, హర్యానా.. వరుసగా టాప్‌-3లో ఉన్నాయన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీఘడ్ మొదటి స్థానంలో ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ టాప్-1లో ఉందన్నారు. అలాగే ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, బిహార్ చివరి స్థానాల్లో నిలిచాయన్నారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు చాలా ముఖ్యమన్నారు. నూతన ఆవిష్కరణలతో అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొవచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version