నాది మిడిల్ క్లాస్.. ఆ కారు నేను కొనలేను : నితిన్ గడ్కరీ

-

మెర్సిడెస్ బెంజ్ చాలా ఖరీదైన కారు అని.. తాను ఆ కారుని కొనలేను అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తాను మధ్యతరగతి వాడినని.. ఆ కారుని తాను కూడా కొనలేనని చెప్పారు. ఈ మేరకు భారత్ లో ఉత్పత్తి పెంచి కాస్త ధరలు తగ్గించాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియాకు సూచన చేశారు.

భారత్‌లో తమ కార్ల ఉత్పత్తిని పెంచాలని విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్ ఇండియాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. దాని వల్ల ధర తగ్గుతుందని, ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ధర ఎక్కువగా ఉండటంతో ఈ కారు తాను కూడా కొనలేనని సరదాగా వ్యాఖ్యానించారు.

పుణెలోని చకన్ తయారీ యూనిట్‌లో దేశీయంగా అసెంబుల్ చేసిన EQS 580 4MATIC EVని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘మీరు ఉత్పత్తి పెంచండి. అప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుంది. మేమంతా మధ్యతరగతి వాళ్లం. ఈ కారు నేను కూడా కొనలేను’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సరికొత్త ఈవీ ధర రూ.1.55 కోట్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news