రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదు : గడ్కరీ

-

ఎవరి వద్దనైనా తాను ఒక్క రూపాయి కమీషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదని తనకు ఎవరి వద్ద నుంచి కమీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు రూ.3 లక్షల ఆదాయం లభిస్తుందని తెలిపారు. తాను హిందీ, మరాఠీ ఇంగ్లీష్‌లో చేసిన ప్రసంగాలకు చాలా మంది వీక్షిస్తారని అమెరికాలో ఉన్న వారు సైతం తన ప్రసంగాల చూస్తారని తెలిపారు.

తాను చిన్నతనంలో పని చేయడానికి ఆసక్తి చూపించకపోయేవాడినని, అప్పుడే ఒకరి కింద పని చేయకుండా నలుగురికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు తనకు లాకోర్స్ చేయమని చెప్పారని, కానీ తన లక్ష్యాన్ని వారికి చెప్పానన్నారు. కులం, మతం, భాష ఆధారంగా వ్యక్తులు గొప్పవారు కారని, వ్యక్తిత్వం, లక్షణాలు గొప్పతనాన్ని నిర్ణయిస్తాయన్నారు. తాను రాజకీయ నాయకుడినని, తనకు అన్ని వర్గాల వారి ఓట్లు అవసరమే అన్నారు. అందుకే తాను కులం గురించి మాట్లాడనని చెప్పారు. అన్ని కులాల వారు తనకు కుటుంబ సభ్యులే, తనకు సోదర సమానులే అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version