నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఇకపై వేగం మరింత పెరగనుంది. ఔటర్‌పై స్పీడ్ లిమిట్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై అత్యధికంగా గంటకు 100 కిలోమీటర్ల వేగం అమలులో ఉంది. అయితే, ఈ వేగాన్ని ఇప్పుడు ప్రభుత్వం పెంచేలా చర్యలు తీసుకుంది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
గతంలో ఓఆర్ఆర్ పై వాహన ప్రమాదాలు అధికం కావడంతో వేగ పరిమితిని 120 కి.మీ నుంచి 100 కి.మీకి తగ్గించారు. అప్పటినుంచి ప్రయాణికుల భద్రత కోసం ఓఆర్ఆర్ పై అనేక చర్యలు తీసుకున్నారు. లైటింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచారు. రహదారి భద్రత ప్రమాణాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా వాహనాల వేగం పెంపు నిర్ణయం తీసుకున్నారు. వేగ పరిమితిని 100 కి.మీ నుంచి 120 కి.మీ వేగం పెంచుతున్నట్టు నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీసులతో మంత్రి కేటీఆర్ సమావేశమై విధివిధానాలపై చర్చించిన అనంతరం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.