టాలీవుడ్ హీరోయిన్ ఆదా శర్మ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె తెలుగు ఇండస్ట్రీకి ‘హార్ట్ ఎటాక్’ మూవీతో పరిచయం అయింది అదా శర్మ. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో కూడా నటించింది. అయితే తెలుగులో అనుకున్నంత పాపులారిటీ దక్కలేదు ఈ బ్యూటీకి. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అలా అక్కడ తన నటనతో మెప్పిస్తూ ఎక్కువగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.
ముఖ్యంగా ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ఆమెకు ఎంతగా గుర్తింపు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుపోతున్న ఆదా శర్మ.. ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.ఆ వీడియోలో బేబీ బంప్స్ తో ముఖం నిండా దెబ్బలతో ఉన్నట్టు కనిపించింది. ఈ మూవీ నేమ్ గెస్ చేయండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.