Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆస్తులు ఎన్నో తెలుసా..!

-

క్యాబినెట్ సెక్రటేరియట్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆస్తుల వివరాలను విడుదల చేసింది. 2023 డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన ఈ ప్రకటనలో.. చర, స్థిరాస్తి నుండి రుణాల వరకు మొత్తం కలుపుకొని సీఎం నితీష్ కుమార్ కు రూ.1.64 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వద్ద రూ.22,552 నగదు, రూ.49,202 వివిధ బ్యాంకు అకౌంట్ లలో జమ అయినాయి. అయితే తన కుమారుడి పేరు మీద ఉన్న ఆస్తి గురించి నితీష్ కుమార్ సమాచారం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. సీఎం నితీష్ ప్రభుత్వంలో ఆయన కంటే ధనవంతులైన 28 మంది మంత్రులు ఉన్నారు.

 

సీఎం నితీష్ కుమార్ కు రూ. 11.32 లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు ఉంది. దీనితోపాటు రూ. 1.28 లక్షల విలువైన రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం ఉన్నాయి .అలాగే రూ. 1.45 లక్షల విలువైన 13 ఆవులు, 10 దూడలు, వ్యాయామ సైకిల్, ట్రెడ్మిల్,ఒక సైకిల్ వంటి ఇతర చరాస్తులు ఉన్నాయి. అంతేకాకుండా మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో 2004లో రూ.13.78 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.1.48 కోట్ల విలువైన అపార్ట్మెంట్ మాత్రమే ఆయనకు చెందిన ఏకైక స్థిరాస్తి అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news